శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (16:31 IST)

అక్కినేని కుటుంబం ఆ విషయంలో సమానంగా ఉన్నారు !

akkenine family
akkenine family
అక్కినేని కుటుంబ నటీనటులలు ఓ విషయంలో అందరూ సమ న్యాయం చేశారనే చెప్పాలి. ఒకప్పడు కథలు ఎంపికలో, దర్శకుడి పరంగా, మార్కెటింగ్ విషయంలో నాగార్జున ముందుంటాడని తెలిసిందే. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కనుక  గత కొద్దీ కాలంగా నాగార్జున అంచనాలు తప్పు చూపిస్తున్నాయి. యూత్ తో సమంగా ఉన్నాననే వైల్డ్ డాగ్ సినిమా చేశారు. బాగుందని టాక్ వచ్చిన పెద్దగా వసూళ్లు రాలేదు. సినిమా నిలబెట్టాలని చిరంజీవి కూడా మాట సాయం చేసి గొప్ప సినిమాగా ప్రచారం చేసాడు.

అనంతరం ది ఘోస్ట్‌ యాక్షన్‌ స్పైథ్రిల్లర్‌ గా నాగార్జున తీసి ఫెయిల్యూర్ చూసాడు. అప్పటినుంచి కొత్త సినిమా చేస్తున్నాననే ఆయన నుంచి మాట కూడా రాలేదు.  శ్రీవెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్స్‌పై నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌మరార్‌ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. 
 
 మరో నటుడు నాగ చైతన్య కూడా థ్యాంక్యూ 2022లో తీసి ఫెయిల్యూర్ పొందారు. ప్రేమకథ సినిమా గా ఇగో ఉన్న హీరోగా ఇందులో నటించాడు. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించాడు. నాగచైతన్య, రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పెద్ద డిసాస్టర్ గా నిలిచింది. 
 
అక్కినేని కుటుంబలో హీరోయిన్గా ఉన్నపుడు శాకుంతలం  చేయడానికి సమంత ఫిక్స్ అయింది. పలు కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ ఇటీవలే విడుదలయింది.  పౌరాణిక సినిమా. ఈ కథను ఇప్పడు చూస్తారా అంటే..కాంచన చూడలేదా! అంటూ గుణశేఖర్ లాజిక్ గా మాట్లాడారు. ఈ సినిమాకు మధ్యలో దిల్ రాజు ప్రవేశించారు. విడుదల తర్వాత మార్నింగ్ షోకే జనాలు లేదు. రెండో  షో నుంచి మరో సినిమా పడింది. పెద్ద డిజాస్టర్గా నిలిచింది.  ఈ వినిమాలో మోహన్ బాబు, దేవ్ మోహన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 
 
ఇక అఖిల్ ఏజెంట్  స్పై థ్రిల్లర్‌ సినిమా. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్యా ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా కూడా టెర్రరిజమ్ బ్యాక్ డ్రాప్ కావడంతో పెద్దగా అభిమానుల్లో కిక్ ఇవ్వలేకపోయింది. అందుకే అన్ని సినిమాలు  అక్కినేని నటులు  సమన్యాయం చేశారని ఫిలిం నగర్ టాక్ నెలకొంది.