మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:50 IST)

విడాకుల తర్వాత కుంగిపోయి చనిపోతాను అనుకున్నా: సమంత

అక్కినేని నాగచైతన్యతో విడిపోయాక తొలిసారి సమంత విడాకులపై స్పందించింది. విడాకులు తీసుకున్న తర్వాత కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. తాను చాలా బలహీనమైన వ్యక్తినని తన ఫీలింగ్. కానీ ప్రస్తుతం తానెంత బలంగా వున్నానో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నానని సమంత వెల్లడించింది. తానింత ధృఢంగా వుంటానని అనుకోలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 
 
ఇకపోతే.. విడాకుల తర్వాత నాగ చైతన్య హైదరాబాద్‌లో ఉంటుండగా, సమంత ఎక్కువగా తన సొంతూరు అయిన చెన్నైలో ఉంటుంది. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సమంత జీవితానికి సంబంధించి ఏదో ఒక అంశంపై రోజూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వస్తోంది. ఇవాళ సమంత విడాకులపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారింది.
 
కాగా ప్రస్తుతం సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాలు అంగీకరిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, పుష్ప సినిమాలో ఒక ఐటెం సాంగ్‌తో పాటు మరో కొత్త ప్రాజెక్టు చేసేందుకు సమంత అంగీకారం తెలిపింది. అలాగే హాలీవుడ్‌లో అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.