ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:27 IST)

సంపూర్ణేష్ బాబు ఏమయ్యాడు.. సినిమాలు ఎందుకు చేయట్లేదు..!

Sampoornesh Babu
టాలీవుడ్‌లో సంపూర్ణేశ్ బాబుకి మంచి ఫాలోయింగ్ వుంది. ఆయన సినిమాలకు మంచి డిమాండ్ వుంది. అలాంటి సంపూ కొంతకాలంగా ఎలాంటి కొత్త ప్రాజెక్టుల్లోనూ కనిపించట్లేదు. దీంతో టాలీవుడ్‌లో సంపూ ఎక్కడ అంటూ టాక్ వస్తోంది. 
 
ఆ మధ్య వచ్చిన కొబ్బరి మట్ట ఆయన కెరియర్‌లో పెద్ద హిట్‌గా చెప్పుకోవాలి. ఆ తరువాత ఆయన నుంచి వరుస సినిమాలు వచ్చాయి. ఆ జాబితాలో బజార్ రౌడీ, క్యాలీఫ్లవర్ కనిపిస్తాయి. 
 
ఆకాశ్ పూరి హీరోగా చేసిన 'చోర్ బజార్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను కూడా చేశాడు. ఆ తరువాత ఇంతవరకూ ఆయన తెరపై కనిపించలేదు. అందుకు కారణం ఏమిటనేది తెలియడం లేదు.