టాలీవుడ్‌లో విషాదం.. దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూత
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. విక్టరీ వెంకటేష్ సొంత బాబాయి మోహన్ బాబు కన్నుమూశారు. ఆయనకు 73 సంవత్సరాలు. ఈయన దిగ్గజ నిర్మాత డి.రామానాయుడికి సొంత సోదరుడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని ఉన్న తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. కాగా, దగ్గుబాటి కుటుంబం స్వస్థలం కారంచేడు అని తెల్సిందే.
మరోవైపు, దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియలు బుధవారం కారంచేడులో నిర్వహించనున్నారు. బాబాయి మృతి నేపథ్యంలో నిర్మాత సురేష్ బాబు, ఆయన తనయుడు అభిరామ్, కారంచేడు వెళ్లి నివాళులు అర్పించారు. హీరోలు వెంకటేష్, దగ్గుబాటి రానాలు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు బుధవారం కారంచేడు వెళ్లి నివాళులు అర్పించే అవకాశం ఉంది.