శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:26 IST)

విజయ్ సోదరి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా?

Sanjana
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సోదరి తెలుగు ప్రేక్షకులను పలుకరించనుంది. విజయ్ ఆన్‌స్క్రీన్ సిస్టర్ సంజనా సారథి త్వరలో తెలుగు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తానంటోంది.

2012లో ఏఆర్ మురుగదాస్‌-విజయ్ కాంబోలో వచ్చిన చిత్రం తుపాకి. ఈ మూవీలో విజయ్ సోదరిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజనా సారథి. నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. 
 
మరో ఇంట్రెస్టింగ్ విషమేంటంటే ఉయ్యాలా జంపాలా ఫేం అవికాగోర్ నవీన్ చంద్ర సోదరిగా కనిపించబోతుందట. ఇప్పటికే ఈ చిత్రషూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందట.

టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నందుకు చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్న సంజనా సారథి.. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంది.