శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (18:51 IST)

''అల వైకుంఠపురంలో..'' వినూత్నంగా మ్యూజికల్ ఫెస్టివల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం 2020, జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ''అల వైకుంఠపురంలో..'' వైభవంగా, వినూత్నంగా మ్యూజికల్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ....'అల వైకుంఠపురంలో' సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్  కెరీర్ లో మరో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్‌గా నిలిచింది ఈ చిత్రం.
 
అందుకు ముఖ్యంగా తమన్‌కు కృతఙ్ఞతలు. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని, 2020 జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ''అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్‌ను '' వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నట్లు తెలిపారు.
 
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.
 
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్, ఏలూరు శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్ నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు).