శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (18:04 IST)

సినిమా బ్యాక్ డ్రాప్ లోని "సర్వం సిద్దం` హిట్ అవుతుందిః బెల్లంకొండ సురేష్

Sarvam Siddam, movie, teaser
గోవింద్ రాజ్, సంతోష్, సిహెచ్ సిద్దేశ్వర్, మందార్, కిరణ్ మెడసాని, పూజ, అనుపమ పట్నాయక్, లావణ్య ప్రధాన పాత్రదారులుగా న‌టిస్తున్న సినిమా "సర్వం సిద్ధం". (నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత టాగ్ లైన్). సినేటెరియా మీడియా వర్క్స్ పతాకంపై అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్ నిర్మించారు. ఈ చిత్రం  ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్రం ప్రీ రిలేజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొనగా మెట్రో టివి జేపీ, సినేటెరియా మీడియా వర్క్స్ వెంకట్ బులేమోని, దర్శకుడు రాబిన్ నాయుడు, నటులు గోవింద్ రాజ్, సంతోష్, సిద్దేశ్వర్ నిర్మాత శ్రీలత బి.వెంకట్, నిర్మాతలు ఎన్.ఆర్ రెడ్డి, అరవింద్,  కెమెరామెన్ సంతోష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ పాల్గొన్నారు..
 
చిత్ర టీజర్ ను బెల్లంకొండ సురేష్ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను కామెడీతో నవ్విస్తుంది. వెరైటీ కామెడీ జానర్ లో సినిమా పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ సినిమాలోని కామెడీని చాలా బాగా తెరకెక్కించారు, అలాగే  ఈ చిత్రం టీజర్ లో ఉన్న రోమాంటిక్ టచ్ చాలా బాగుంది..ఈ చిత్ర ట్యాగ్ లైన్ "నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత" కామెడీ పతాక స్థాయిని తెలియజేస్తోందని అన్నారు. సినిమా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించాయనీ, అలాగే ఈ చిత్రం కూడా సినిమా నిర్మాణంలో దర్శకుల శైలిని హాస్యకోణంలో చూయిస్తోంది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకలోకం ఆదరించాలని బెల్లంకొండ సురేష్ విజ్ఞప్తి చేశారు.
 
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..  సర్వం సిద్దం సినిమా విజువల్ గా చాలా బాగా వచ్చిందని తెలిపారు. ఈ చిత్రం టీజర్ మరియు మోషన్ పోస్టర్లలో చిత్రంలో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేస్తోందనీ, ఈ చిత్రం ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.  
 
దర్శక నిర్మాత ఎన్.ఆర్ రెడ్డి మాట్లాడుతూ.. టీజర్లోని ఒక్క డైలాగే చిత్రంలో ఉన్న పుష్కలమైన హాస్యం ప్రేక్షకులకు నవ్వించడానికి సిద్దంగా ఉందని తెలియజేస్తోందని అన్నారు. 
 
చిత్ర దర్శకులు రాబిన్ నాయుడు మాట్లాడుతూ.. ఈ చిత్రం మంచి కామెడీతో కూడుకున్నదనీ, టెక్నీషియన్లు, నటీనటులు చక్కగా సహకరించి మంచి కామెడీని మీకు అందించ్డంలో తమ చేయూతనందించారు. నిర్మాత శ్రీలత బడ్జెట్ కి వెనకాడకుండా గుడ్ క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. బొబ్బిలి సంతోష్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. వెంకట్ గారు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.. అన్నారు  ఇంకా సినెటేరియా సీఈవో వెంకట్ బులెమోని, నటుడు గోవింద్ రాజ్ త‌దిత‌రులు మాట్లాడుతూ, సినిమా విజ‌యవంతం కావాల‌ని ఆకాంక్షించారు.