గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (18:27 IST)

''బజార్ రౌడీ''గా వస్తోన్న బర్నింగ్ స్టార్.. ట్రైలర్ అదుర్స్ (video)

Bazar Rowdy
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా బజార్ రౌడీ అనే సినిమా ద్వారా తెరముందుకు వస్తున్నాడు. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షాయాజీ షిండే, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 
 
తాజాగా 'బజార్‌ రౌడి' టీజర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఇందులో సంపూ డైలాగ్స్ అదిరిపోతున్నాయి. ''రౌడీయిజం చెయ్యాలంటే జీపు.. జీపులో పెట్రోలు.. దానిలో రౌడీలు కాదురా.. దమ్ము కావాలి" అంటూ డైలాగుల్ని పేల్చేస్తున్నారు సంపూర్ణేశ్‌ బాబు. 
 
ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగిన ఈ టీజర్‌లో సంపూర్ణేశ్‌ బాబు చెప్పిన డైలాగులే హైలైట్‌గా నిలిచాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
'హృదయకాలేయం'తో సంపూర్ణేశ్‌బాబు నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన ఆయన విభిన్న కథలతో వరుస సినిమాలు చేస్తున్నారు. తనదైన నటనతో ప్రేక్షకులను నవ్విస్తున్న సంగతి తెలిసిందే.