మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (17:15 IST)

మన మూలాలకు సంబంధించిన కథలే ప్రయత్నిస్తా : మ‌హి వి.రాఘ‌వ్‌

Mahi V. Raghav
Mahi V. Raghav
ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఈ వెబ్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 1 బ్లాక్ బస్టర్, తర్వాత ‘సైతాన్’ సూపర్ హిట్ ఇప్పుడు ‘సేవ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇలా టాలీవుడ్‌లో మహి వి.రాఘవ్ హ్యాట్రిక్ హిట్స్ సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 
 
రైటర్, నిర్మాత, దర్శకుడిగా ఇప్పటికే తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు మహి. తన  త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై డైరెక్టర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తూనే షో రన్నర్‌గానూ వెబ్ సిరీస్‌లను కూడా రూపొందిస్తూ షో రన్నర్‌గా సూపర్ హిట్స్‌ను అందించారు. 
 
‘‘ఇంత మంచి విజయాలను అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్ ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి ప్రయత్నిస్తాను. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది’’ అన్నారు మహి.వి.రాఘవ్
 
సేవ్ ది టైగర్స్ సీజన్ 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే, సీజన్ 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ సీజన్ 1 చాలా పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్ 2పై కాస్త ఒత్తిడిగా ఫీలయ్యాను. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. అలాగే సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే మరికొన్ని వెబ్ షోలను రూపొందించటానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు మహి.వి.రాఘవ్.