శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' టైటిల్ సీక్రెట్ ఇదేనా?

"బాహుబలి" చిత్రం తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను 'ఆర్ఆర్ఆర్‌'ను వర్కింగ్ టైటిల్‌గా పెట్టినట్టు గతంలో దర్శకుడు జక్కన్న గతంలో మీడియా ముఖంగా ప్రకటించారు. 
 
ఈ క్రమంలో సినిమా టైటిల్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం న‌లుగుతున్న "ఆర్ఆర్ఆర్" వ‌ర్కింగ్ టైటిల్ మాత్రమే. దీనికి స‌రిపోయేలా మంచి టైటిల్‌ను కూడా సూచించాల‌ని చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో ప్రేక్ష‌కుల‌ను కోరింది. దీంతో అనేక మంది 'ఆర్ఆర్ఆర్‌'కు స‌రిపోయేలా చాలా ర‌కాల టైటిల్స్‌ను చెప్పారు. 
 
తాజాగా ఈ సినిమాకు 'రామ‌రౌద్ర రుషితం' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ద‌క్షిణాదిన 'రామ‌రౌద్ర రుషితం' అనే టైటిల్‌ను.. ఇత‌ర భాష‌ల్లో 'రైజ్ రివోల్ట్ రివేంజ్' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారన్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. త్వ‌ర‌లోనే టైటిల్‌పై ఓ క్లారిటీ రానుంది.