సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (16:42 IST)

ఓట్లు వేసినవారంతా మళ్లీమళ్లీ ఓట్లు వేసేలా చేయాలి : సీఎం జగన్

గత ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేసినవారంతా మళ్లీ మళ్లీ తమకే ఓట్లు వేసేలా గ్రామ, వార్డు వాలంటీర్లంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారందరికీ సీఎం జగన్ నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారికి సీఎం జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 
 
సీఎం జగన్ చేసిన ప్రసంగం వివరాలు... దేశ చరిత్రలో తక్కువ సమయంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. 20 లక్షల పైగా అభ్యర్థులు పరీక్ష రాసి  8 రోజులు పరీక్షలు పెట్టి లక్ష 40 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు రావడం రికార్డు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రికార్డు ఇది.  గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రతి గ్రామానికి 10-12ఉద్యోగాలు ఇచ్చాం. ఇంత భారీగా ఉద్యోగాలిచ్చిన చరిత్ర దేశంలోనే లేదు. సరికొత్త రికార్డు నెలకొల్పాం. 
 
4 నెలలు తిరక్క ముందే అక్షరాలా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగా. ఉద్యోగంగా కాకుండా ఉద్యమంగా తీసుకోవాలి. సొంత మండలంలో ఉద్యోగం చేయగలిగే అధృష్టం చాలా తక్కువ మందికే దొరుకుతుంది. సొంత మండలంలో పనిచేస్తూ సేవలందించి మంచిపేరు తీసుకురావాలి. చిత్తశుద్దితో, నిజాయతిగా పారదర్శక పాలన అందించాలని అందరినీ కోరుతున్నా. ప్రజలకు చేరువగా ఉంటూ సేవలందించడం కోసం ఉద్యోగం చేస్తున్నామని అందరూ గుర్తుచుకోవాలి. 

పారదర్శక పాలన మీరు తీసుకు వస్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. లంచాలివ్వకుండా పనులు జరగని రీతిలో మన వ్యవస్థ ఉంది. జన్మభూమి కమిటీల పేరుతో చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వనిదే జరగని పరిస్థితి ఉండేది. వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చేందుకే గ్రామ వార్డు సచివాలయాలు తీసుకువచ్చాం. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ తీసుకువచ్చాం, గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా 72 గంటల్లో సేవలు అందించాలి. 34 డిపార్టుమెంట్లకు సంబంధించి పనులు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతాయి. 

సంక్షేమ పథకాలు కేవలం 72 గంటల్లోనే అందించినపుడు పేదల్లో చిరునవ్వులు కనిపిస్తాయి. ప్రభుత్వం ధృవీకరించిన విత్తనాలు, ఎరువులను  గ్రామ సచివాలయం పక్కనే షాప్ పెట్టి అందిస్తాం. గ్రామ సచివాలయాల్లో డిసెంబరు తొలివారం కల్లా కంప్యూటర్లు, సహా ఇతరత్రా పరికరాలు, ఫర్నీచర్ పూర్తిగా అందుబాటులోకి తెస్తాం. జనవరి 1 నుంచి దాదాపు 500 సేవలు గ్రామ సచివాలయాల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. జనవరి నుంచి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ పథకాలన్నీ గ్రామ సచివాలయం పరిధిలోకి వస్తాయి. 
 
లబ్ది దారుల వివరాలను గ్రామ సచివాలాల్లో నోటీసు బోర్డులు కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడవద్దు. మనకు ఒటు వేయని వారు కూడా మనం చేసే మంచి చూసి ఒటు వేయాలి. పారదర్శకతతో అందరకీ సంక్షేమ పథకాలు అందించాలి. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి. ఫిర్యాదుల కోసం సీఎం పేషిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. 1902 కంప్లైంట్ చేస్తే నేరుగా సీఎం పేషికి కనెక్ట్ చేసి ఫిర్యాదులు తీసుకుంటున్నాం. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. 
 
గ్రామ వాలంటీర్, సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి రెండుకళ్లు. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ ఉద్యోగుల భుజస్కందాలపై ఉంది. ఉద్యోగాలు సాధించిన 1 లక్ష 35 వేల మంది అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. పారదర్శకంగా, అవకతవకలు లేకుండా నియామకాలు చేసిన ఉన్నతాధికారులకు సెల్యూట్ చేస్తున్నా. పురపాలక, గ్రామీణాభివృద్దిశాఖ అధికారులు, ఉన్నతాధికారులు సమర్థంగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రతి కలెక్టర్, ఎస్పీలకు అభినందనలు తెలియజేస్తున్నా.. ఉద్యోగాలు రానివారెవరూ నిరాశ చెందవద్దు. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతా. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జనవరిలో భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.