జూదానికి పులి పులివెందుల : వర్ల రామయ్య ఆరోపణ
పులివెందులను జూదానికి పులిగా మార్చారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాన్ని గ్యాంబ్లింగ్ డెన్‌గా మార్చారని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, సీఎం సొంత నియోజకవర్గం అంటే క్లీన్ అండ్ గ్రీన్ అవ్వాల్సింది. కానీ, జూదానికి పులిగా మార్చారని ఆరోపించారు.
మీ సొంత నియోజకవర్గంలో ప్రతిరోజు 12 కోట్ల రూపాయల గ్యాంబ్లింగ్ జరుగుతుంది నీకు తెలియదా జగన్? అంటూ ప్రశ్నించారు. జూదాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మీ నియోజకవర్గం జూదంలో అభివృద్ధి జరిగింది నిజామా కాదా?,
మర్డర్లు, దాడులు, గ్యాంబ్లింగ్ జరుగుతున్న పట్టించుకోరని ధ్వజమెత్తారు. అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజల ఋణం తీర్చుకోవాల్సింది పోయి అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయిందన్నారు. ఎటు చూసినా జూదం, డబ్బాట మట్కా, తదితర జూద విభాగాలతో లాస్ వేగాస్‌గా మార్చిన ముఖ్యమంత్రి.. రాయలసీమలో జూద కళను విపరీతంగా పులివెందుల విపరీతంగా ఆకర్షిస్తోందని ఆరోపించారు.