శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (12:24 IST)

నేడు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం

పోలవరం ప్రధాన డ్యాం నుంచి ఎడమ కాలువ అనుసంధాన పనులకు ఆరు గుత్తేదారు సంస్థలు పోటీపడుతున్నాయి. ఆ సంస్థల నుంచి టెండరు బిడ్లు దాఖలయ్యాయి. రూ. 274.55 కోట్ల ఐబీఎం విలువతో జలవనరుల శాఖ టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈఎండీకి సంబంధించిన బ్యాంకు గ్యారంటీలు, డీడీల వివరాలను సరిచూసుకుని ఈ సంస్థలు రివర్స్ టెండర్లలో పాల్గొనవచ్చని జలవనరులశాఖ నిర్ణయానికి వచ్చింది. 
 
పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్​ఫ్రా లిమిటెడ్, ఆప్కాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్​ఆర్​సీఐఐపీఎల్, డబ్యూసీపీఎల్ సంయుక్త భాగస్వామ్యం, మేఘ ఇంజినీరింగా లిమిటెడ్, ఎంఆర్​కేఆర్ ఎస్​ఎల్​ఆర్ సంయుక్త భాగస్వామ్యంతో మెుత్తం 6 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభంకానుంది.