ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (17:26 IST)

ఎన్ని కేసులైనా పెట్టుకోండి... చంద్రబాబు

తమపైనా, తమ పార్టీ కార్యకర్తలపైనా ఎన్ని కేసులైనా పెట్టుకోండి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
జగన్.. జనాలను భయపెట్టి పాలన సాగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయి హత్యకు గురైతే.. అందుకు కారకులను పట్టుకోవడం చేతకాని ముఖ్యమంత్రి తెలుగుదేశం కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పల్నాడును రక్షించుకోవడానికి ఈనెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీడీపీ ఒంటరికాదనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుపుదామని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
 
వైసీపీ నేతల ఆటలు సాగనివ్వమని.. ఇష్టానుసారం దాడులు చేయడం కేసులు పెట్టడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అందరికంటే ముందు తానే నిలుస్తానని.. తనపైన కేసు పెడతారేమో చూద్దామని చంద్రబాబు కార్యకర్తలతో అన్నారు.