శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2017 (13:03 IST)

'నా బేబీ బాయ్‌ బర్త్‌డే సందర్భంగా గోవాలో హాలీడే' : అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్... తన కుమారుడు అల్లు అయాన్‌తో కలిసి గోవాలో సందడి చేస్తున్నారు. తన కుమారుడిని ఉప్పుమూటలా వీపు వెనుక ఎక్కించుకుని ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం 'దువ్వాడ జగన్నాథమ్' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, షూటింగ్‌ను పక్కనబెట్టి, కుమారుడితో ఆటలాడుతూ సేదదీరాడు. కొడుకు పుట్టిన రోజును గోవాలో జరుపుకున్న అల్లు వారబ్బాయి, కుడుకును భుజాన ఎక్కించుకుని ఈత కొలనులో సందడి చేస్తూ, తీయించుకున్న ఫోటోను ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. 
 
‘నా బేబీ బాయ్‌ బర్త్‌డే సందర్భంగా గోవాలో హాలీడే జరుపుకుంటున్నాను..’ అంటూ ట్వీట్ చేశారు. కొన్ని గంటల క్రితం అల్లు అర్జున్ ఈ ట్వీట్ చేయగా, వందలాది మంది అభిమానులు దీన్ని రీట్వీట్ చేయడంతో ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అల్లు అర్జున్‌ శ్రేయా రెడ్డి దంపతులకు ఒక కుమారుడు, ఓ కుమార్తె పుట్టిన విషయం తెల్సిందే.