మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జులై 2018 (13:32 IST)

ఆ వ్యక్తి ఫోన్ చేసి గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు : ఆమని

సీనియర్ నటుడు నరేష్ హీరోగా వచ్చిన చిత్రం "జంబలకిడిపంబ". ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆమని. ఆ తర్వాత 'శుభలగ్నం'లో 'ఏమిటో...' డైలాగుతో అందర్నీ ఆకట్టుకున్న నటి. ఎన్నో మంచి పాత్రలు పోషిం

సీనియర్ నటుడు నరేష్ హీరోగా వచ్చిన చిత్రం "జంబలకిడిపంబ". ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆమని. ఆ తర్వాత 'శుభలగ్నం'లో 'ఏమిటో...' డైలాగుతో అందర్నీ ఆకట్టుకున్న నటి. ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ఓ ఇమేజ్‌ సృష్టించుకుంది. కమర్షియల్‌ దర్శకులతో పాటు కళాత్మక దర్శకులైన బాపు, కె.విశ్వనాథ్‌లతో కూడా పనిచేసే అదృష్టం ఆమెకు దక్కింది. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే హఠాత్తుగా ప్రేమపెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.
 
ఆ తర్వాత  రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన చిత్రం "ఆ నలుగురు". ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా "ఐపీసీ సెక్షన్ భార్యా బంధు" చిత్రంలో వెండితెరపై మరోమారు తళుక్కున మెరిసింది. అయితే, ఈమె తన సినీ కెరీర్‌లోని ఎత్తుపల్లాల గురించి మనసువిప్పి మాట్లాడింది. 
 
దర్శక దిగ్గజాలు బాపు, విశ్వనాథ్‌ వంటి డైరెక్టర్లతో కలిసి పని చేయడం నాకు దక్కిన అదృష్టం. వీరంతా లెజెండ్స్‌. ఆ స్కూలే వేరు. వాళ్లతో సినిమా చేయడమనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు.
 
నేను సినిమాలు చేయాలని మా అమ్మ చాలా ఎంకరేజ్‌ చేసింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్టేజ్‌కు వచ్చాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కష్టాలు కనిపించడం లేదా! ఇంత మంచి లైఫ్‌ నీకు దొరకదు అని అమ్మ గుర్తు చేసింది. కానీ అమ్మ మాటలు కూడా కేర్‌ చేయలేదు. అమ్మ చాలా ఫీలైంది. ఫైట్‌ చేసింది కూడా. చివరకు పెళ్లి చేసుకో... అయితే నటించు అంది. కానీ మా ఆయనకు నటించడం ఇష్టం లేదని చెప్పారు.
 
చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టంతో వచ్చాను. నటనంటే నాకు చాలా ఇష్టం. అదే విషయం ఆయనకు చెబితే ఓకే అన్నారు. క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ, ఖచ్చితంగా ఈ పరిస్థితి ఇండస్ట్రీలో ఉందని నేను చెప్పలేను. కానీ, తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి గెస్ట్ హౌస్‌కు రమ్మని చెప్పారు. అంతే.. అంతటితో ఆ వ్యక్తికు మధ్య ఉన్న సంబంధం తెగిపోయిందని ఆమని చెప్పుకొచ్చింది.