మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (15:17 IST)

శ్రీరెడ్డి లీక్స్.. ఈసారి అలీ షోస్ దర్శకుడు: ఆమె GREAT ANCHOR, BUSINESS RANI?

సుచీలీక్స్ తరహాలో శ్రీరెడ్డి లీక్స్ అంటూ మొన్నటికి మొన్న ఓ ఫోటోను పోస్టు చేసిన శ్రీరెడ్డి.. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో కొన్ని ప్రోగ్రామ్‌లకు దర్శకత్వం వహించే ఒక దర్శకుడిని టార్గెట్ చేస్తూ.. ఫేస్‌బు

సుచీలీక్స్ తరహాలో శ్రీరెడ్డి లీక్స్ అంటూ మొన్నటికి మొన్న ఓ ఫోటోను పోస్టు చేసిన శ్రీరెడ్డి.. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో కొన్ని ప్రోగ్రామ్‌లకు దర్శకత్వం వహించే ఒక దర్శకుడిని టార్గెట్ చేస్తూ.. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ఇంకొక మహా రాజ శ్రీ... అంటూ దారుణ పదజాలంతో ఆ పోస్టులో శ్రీరెడ్డి తిట్టిపారేసింది. 
 
ప్రముఖ హాస్యనటుడు అలీ షోస్ చేస్తూ వుండే ఆ వ్యక్తి.. ప్రోగ్రామ్స్‌కు వచ్చిన అమ్మాయిలను, యాంకర్స్‌ కోసం ట్రై చేస్తున్న అమ్మాయిలను దారుణంగా మోసం చేసినవాడని.. ఇందులో అలీకి ఏమీ తెలియదని శ్రీరెడ్డి తెలిపింది. 
 
ఆఫర్ల పేరుతో అమ్మాయిలను లొంగదీసుకుంటున్నాడని చెప్పింది. ఓ టీవీలో షోస్ చేసే దర్శకుడి వేధింపులపై సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది. ఇవన్నీ తన భార్యతో కలిసే చేస్తాడని.. ఆమె కూడా ఓ ప్రముఖ యాంకర్ అని, బిజినెస్ రాణి అంటూ తెలిపింది. ఆమెకు కనెక్షన్స్ ఎక్కువ ఎవరితో తనను బెదిరిస్తుందో ఏమో అంటూ శ్రీరెడ్డి పోస్టు పెట్టింది.