శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (13:45 IST)

ప్లీజ్ బాలయ్యా.. ఒకే ఒక్క షాట్‌లో చూపించవూ... ప్రాధేయపడుతున్న దర్శకేంద్రుడు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు చిన్నపిల్లాడిలా మారిపోయాడు. తన జీవితానికి బంగారు బాటలు వేసిన హీరో స్వర్గీయ ఎన్టీ.రామారావు అంటూ సభా వేదికపై నుంచి సగర్వంగా వెల్లడించారు. ఆ తర్వాత తన మనసులోని కోరికను చిన

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు చిన్నపిల్లాడిలా మారిపోయాడు. తన జీవితానికి బంగారు బాటలు వేసిన హీరో స్వర్గీయ ఎన్టీ.రామారావు అంటూ సభా వేదికపై నుంచి సగర్వంగా వెల్లడించారు. ఆ తర్వాత తన మనసులోని కోరికను చిన్నపిల్లాడిలా వెల్లడించారు.
 
తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ఒక్క సన్నివేశం (షాట్)లో నటించే మహద్భాగ్యం కల్పించాలని హీరో, చిత్ర నిర్మాత బాలకృష్ణను కోరారు. దీనికి బాలయ్య వెంటనే స్పందించి తన అంగీకారాన్ని తెలిపారు. 
 
కాగా, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ చిత్ర షూటింగ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వయంగా పాల్గొని ప్రారంభించారు. ఇందులో కె.రాఘవేంద్ర రావు కూడా పాల్గొని మాట్లాడుతూ, నటసార్వభౌమ, నటరత్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న చిత్రంలో తనకు ఒక్క షాట్‌లోనైనా నటించే అవకాశం ఇవ్వాలని కోరారు.
 
ఎన్టీఆర్ ఓ యుగపురుషుడు. అలాటి మహానుభావుడి జీవిత చరిత్రను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నప్పుడే బాలకృష్ణ జీవితం ధన్యమైందన్నారు. అయితే, తనకు ఒకే కోరిక ఉందని, దాన్ని తేజ, బాలయ్య తీర్చాలని చెబుతూ, ఈ సినిమాలో ఎన్టీఆర్‌పై కనీసం ఒక్క షాట్‌ను తాను దర్శకత్వం వహిస్తున్నట్టు చిత్రీకరించాలని కోరారు. దీనికి బాలకృష్ణ సభా వేదికపైనే తన అంగీకారాన్ని తెలిపారు.