సోమవారం, 8 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (22:09 IST)

రెండేళ్ల పాపాయిని ఎత్తుకెళ్లిన కోతుల గుంపు.. నీళ్ల డ్రమ్ములో పడేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

Monkey
Monkey
ఉత్తరప్రదేశ్‌లో కోతులు ఓ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి. ఓ కోతుల గుంపు రెండేళ్ల పాపను లాక్కెళ్లి హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. సీతాపూర్‌ అనే గ్రామంలో ఓ ఇంట్లో కోతులు ప్రవేశించాయి. అదే సమయంలో అందులో రెండేళ్ల పాప నిద్రపోతోంది. దీంతో కోతులు ఆ పాపను ఎత్తుకెళ్లాయి. 
 
ఆపై ఇంటిపైన వున్న నీళ్ల డ్రమ్ములో పడేశాయి. ఇంటిపై నుంచి పాప ఏడుపు శబ్దం వినిపిండచంతో బయటున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, డ్రమ్ములో వున్న బిడ్డను కాపాడి ఆస్పత్రికి తరలించారు. కానీ అంతలో జరగాల్సింది జరిగిపోయింది. కానీ ఫలితం లేకుండా పోయింది. 
 
అప్పటికే ఆ పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సీతాపూర్‌ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కోతుల బెడత ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నోసార్లు చెప్పామని ధ్వజమెత్తారు. తరచుగా కోతులు తమ గ్రామంలో చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయంటూ వాపోయారు.