శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 ఆగస్టు 2022 (21:12 IST)

బ్రహ్మాస్త్ర చిత్రంలో షారూక్ ఖాన్ లుక్ లీక్

Sharukh Khan
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన చిత్రాలు దాదాపు బోర్లా పడ్డాయి. ఈ నేపధ్యంలో ఇండస్ట్రీ అంతా బ్రహ్మాస్త్ర చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9, 2022న విడుదల కాబోతోంది. రాజమౌళి ఈ చిత్రాన్ని అన్ని దక్షిణాది భాషల్లో సమర్పిస్తున్నారు. దీనితో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 
ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ కూడా పవర్ ఫుల్ క్యామియోలో నటిస్తున్నాడు. తాజాగా లీక్ అయిన స్టిల్‌ థ్రిల్ చేస్తోంది. షారుఖ్ ఖాన్ వానర్ అస్త్ర పాత్రను పోషిస్తున్నాడు. లీక్ అయిన చిత్రంలో షారూక్ రక్తంతో తడిసిన చొక్కాతో కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ చూసినవారు మరింత ఆసక్తిగా బ్రహ్మాస్త్ర చిత్రం గురించి చూస్తున్నారు.

 
స్టార్ స్టూడియోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ చిత్రానికి పంకజ్ కుమార్ సినిమాటోగ్రాఫర్, ప్రీతమ్ సంగీతం అందించారు.