ఆదివారం, 17 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 8 జులై 2016 (16:38 IST)

భార్య మీరాతో షాహిద్ కపూర్ స్వీట్ లిప్ లాక్.. తొలి యానివర్సరీ సెలెబ్రేషన్స్ అదుర్స్!

బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ తన భార్య మీరాను అపురూపంగా చూసుకుంటున్నాడు. గత ఏడాది జూలైలో వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. మొదటి యానివర్సరీని అట్టహాసంగా జరుపుకున్నారు. తొలి యానివర్సరీని

బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ తన భార్య మీరాను అపురూపంగా చూసుకుంటున్నాడు. గత ఏడాది జూలైలో వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. మొదటి యానివర్సరీని అట్టహాసంగా జరుపుకున్నారు. తొలి యానివర్సరీని పురస్కరించుకుని షాహిద్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యని ముద్దాడుతున్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 
 
సెలెబ్రిటీలతోనే ముద్దూముచ్చట ఉంటుందా? భార్యతోనూ ముద్దూముచ్చట ఉంటుందని.. షాహిద్ కపూర్ ఈ ఫోటో ద్వారా ఫ్రూప్ చేశాడు. అమాంతం భార్యతో లిప్ లాక్‌ చేసిన బొమ్మను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక షాహిద్-మీరాల ఈ యానివర్సరీ స్పెషల్ ఏంటో తెలుసా…. త్వరలో వీరు తల్లితండ్రులు కాబోతున్నారు. సెప్టెంబర్‌లో మీరా ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో షాహిద్-మీరాల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.