శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (20:27 IST)

వారు అమ్మాయిలే కాదు.. వ్యభిచారులు.. శక్తిమాన్

Mukesh khanna
Mukesh khanna
మొన్నటికి మొన్న కపిల్ శర్మ ఒక బూతు షో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుకొన్నాడు శక్తిమాన్ ముఖేష్ ఖన్నా. ఇక ఆ వివాదం నుంచి బయటపడకముందే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచాడు. అయితే ఈసారి ఆడవారిని కించపరుస్తూ మాట్లాడడంతో నెటిజన్లు ఆయనను ఏకిపారేస్తున్నారు.
 
ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గురించి వివరిస్తూ.. బెడ్ షేర్ చేసుకుంటాను అని చెప్పే అమ్మాయిలను నమ్మకండి. నా దృష్టిలో అలా చెప్పేవారు అమ్మాయిలే కాదు వారు వ్యభిచారులు. పద్ధతిగా పెరిగిన ఏ ఆడపిల్ల, ఒక పురుషుడితో పడుకోవాలని ఉంది అని కోరదు. అలా అడిగింది అంటే ఆమె ఆడది కాదు.. ఆమెకు సమాజంలో బతికే అర్హతే లేదు. దయచేసి అలాంటివారికి దూరంగా ఉండండి" అంటూ చెప్పుకొచ్చాడు. 
 
ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడవారి గురించి ఇంత ఘాటుగా మాట్లాడానికి మీకు నోరు ఎలా వస్తుంది. అందరు ఆడవారు కావాలని చేయరు.. అసలు ఆడవారి గురించి ఇలా మాట్లాడడం పద్దతి కాదు అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.