గ్లోబల్ స్పిరిచువల్ కమలేష్దాజీ ఆశీస్సులు పొందిన క్లిన్‌కార కొణిదెల
Upasana - Klinkara Konidela - Kamleshdaji
మెగాస్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ కు శుక్రవారం హాజరైంది. అక్కడ గ్లోబల్ స్పిరిచువల్ కమలేష్దాజీ ఆశీస్సులు తన కుమార్తె క్లిన్‌కార కొణిదెలకు వుండాలని కోరుకుంది. మీరు నిజంగా ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చారు. నేను నా బిడ్డను అన్ని సానుకూలతలను అనుభవించడానికి, స్వీకరించడానికి మీమీ దీవెనలతో తీసుకురావాలి. అని ఉపాసన సోషల్ మీడియాలో పేర్కొంది.
అదేరోజు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని క్లిన్‌కార కొణిదెలతో కలవడం ఆనందంగా ఉంది అని పేర్కొంది.
హైదరాబాద్‌లో శివార్ లోని కన్హ శాంతి వనంలో జరిగిన గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గాయకుడు శంకర్ మహదేవన్ చేసిన ఆకర్షణీయమైన ప్రదర్శనను చూసి దాదాపు 70,000 మంది ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. మూడు రోజులపాటు జరనున్న ఈ కార్యక్రమం ఆదివారంతో ముగియనుంది. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.