శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (16:29 IST)

'ఆర్ఆర్ఆర్'లో ఐశ్వర్య రాజేష్.. ఎన్టీఆర్‌ని ప్రేమించే గిరిజన యువతి పాత్రలో..?

Aishwarya Rajesh
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో వస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. ఈ సినిమాను జక్కన్న ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 
 
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరీస్ నటిస్తోంది. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి మరో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్‌ నటించనుందని టాక్ నడుస్తోంది. 
 
చాలా తక్కువ నిడివితో.. ఎన్టీఆర్‌ని ప్రేమించే ఒక గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య రాజేష్‌ కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతమేర నిజమనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!