గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:59 IST)

"పెళ్లి సందD" హీరోయిన్ శ్రీలీల ఆయన కుమార్తె కాదా?

సీనియర్ హీరో శ్రీకాంత్ - ఊహ దంపతుల కుమారుడు రోషన్. ఈయన హీరోగా తాజాగా వచ్చిన చిత్రం "పెళ్లి సందD". ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల అనే యువతి నటించింది. ఈమె ఇపుడు ఓ వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల తన బయోడేటాలో తన తండ్రి పేరును శుభాకరరావు సూరపనేనిగా పేర్కొంది. 
 
అయితే విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు శ్రీలీల తన కుమార్తె కాదని స్పష్టం చేశారు. ‘పెళ్లిసందD’ సినిమా నేపథ్యంలో శ్రీలీల ఇంటర్వ్యూలు ఇస్తూ తన తండ్రి శుభాకరరావు అని చెప్తున్న నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. 
 
శ్రీలీల తన కుమార్తె కాదని క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల తల్లి స్వర్ణలతతో తాను 20 ఏళ్ల క్రితమే విడిపోయానని చెప్పారు. తాము విడిపోయే సమయానికి తన మాజీ భార్య గర్భవతి కూడా కూదని, తాము విడిపోయాక వేరొకరి ద్వారా తన మాజీ భార్యకు శ్రీలీల జన్మించిందని శుభాకరరావు వివరించారు. 
 
తన ఆస్తులపై క్లయిమ్ చేయడానికే తన పేరును వాడుతున్నారని శుభాకరరావు ఆరోపించారు. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళతామని చెప్పారు. తనకు సాయితన్వి సూరపనేని అనే ఒక్క కుమార్తె మాత్రమే ఉందని శుభాకరరావు స్పష్టం చేశారు.