శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా చిత్రం 'వేయి శుభములు కలుగు నీకు' సినిమా టీజర్ రిలీజ్
జయ దుర్గదేవి మల్టీ మీడియా పతాకంపై శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా, తమన్నా వ్యాస్ హీరోహీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం "వేయి శుభములు కలుగు నీకు". హీరో సునీల్ ఈ చిత్రం యొక్క టీజర్‌ను విడుదల చేసి యూనిట్ సభ్యులందరికి తన శుభాకాంక్షలు తెలియజేసారు.
అనంతరం పాత్రికేయుల సమావేశం లో శివాజీ రాజా మాట్లాడుతూ "జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మాతగా మా అబ్బాయి విజయ్ రాజా హీరోగా నటిస్తున్న చిత్రం "వెయ్యి శుభములు కలుగు నీకు". ఈ చిత్రం క్లాప్ హీరో నాగశౌర్య చేయగా హీరో నాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఇప్పుడు హీరో సునీల్ ఈ చిత్రం యొక్క మొదటి టీజర్‌ను విడుదల చేసారు, వారికీ నా కృతజ్ఞతలు.
మా విజయ్ పుట్టిన రోజున కథ విన్నాను, చాలా బాగా నచ్చింది. సినిమా షూటింగ్ టాకీ అంతా పూర్తయ్యింది. సాంగ్స్ చిత్రీకరణ ఉంది. మా అబ్బాయి విజయ్ రాజాకి మంచి నిర్మాత మరియు మంచి దర్శకుడు దొరికారు. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. టీజర్ చాలా బాగుంది. నన్ను ఆశీర్వదించినట్లే నా కుమారుడిని కూడా ఆశీర్వదించండి" అని కోరుకున్నారు.
హీరోయిన్ తమన్నా వ్యాస్ మాట్లాడుతూ "ఈ కరోనా టైంలో షూటింగ్ పూర్తి చేసాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మరియు నిర్మాతకి ధన్యవాదాలు. మా హీరో విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని తెలిపారు.
హీరో విజయ్ రాజా మాట్లాడుతూ "నా పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు సునీల్ అన్న మా సినిమా టీజర్ రిలీజ్ చేసారు, వారికి నా ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వస్తుంది. డైరెక్టర్ గారు సినిమాని బాగా చేస్తున్నారు, నిర్మాత గారు కంప్రమైస్ కాకుండా ఖర్చు పెడుతున్నారు. ఇదే టీంతో మళ్లీ ఇంకో సినిమా త్వరలోనే స్టార్ట్ చేస్తాము" అని తెలిపారు.
మరో హీరోయిన్ జ్ఞానప్రియ మాట్లాడుతూ, "ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నిర్మాత గారికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా" అని తెలిపారు. దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ, "నాగశౌర్య గారి క్లాప్ ఇస్తే, హీరో నాని గారు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తే ఇప్పుడు మా అందాల రాముడు హీరో సునీల్ గారు మా సినిమా టీజర్‌ను విడుదల చేసారు, హీరోలందరికి ధన్యవాదాలు. మా హీరో విజయ్ రాజాకి జన్మదిన శుభాకాంక్షలు. మా సినిమాకి మంచి టైటిల్ దొరికింది. గురు గారు శివాజీ రాజా గారికి నా ధన్యవాదాలు. నాకు మంచి ఆక్టివ్ ప్రొడ్యూసర్ దొరికాడు. ప్రతి రోజు మా నిర్మాత అన్నీ చూసుకుంటుంటాడు. సినిమా బాగా వస్తుంది" అని తెలిపారు.
హీరో సునీల్ మాట్లాడుతూ "నా కెరీర్ స్టార్టింగ్‌లో నేను ఫస్ట్ కలిసింది శివాజీ రాజా గారినే. చాలా బాగా సహాయం చేసారు. విజయ్ రాజా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మంచి మనిషి, తన కళ్ళు బాగుంటాయి. తనకి జన్మదిన శుభాకాంక్షలు. టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉంది, సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.