సంబంధిత వార్తలు
- డియర్ శివాత్మిక... మీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా: చిరంజీవి ట్వీట్
- మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి: రాజశేఖర్ కుమార్తె శివాత్మిక
- బాక్సర్‌గా వస్తున్నా.. స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నా.. ఈషా రెబ్బా
- పవన్‌కళ్యాణ్ బయటపెట్టిన హీరోల స్కెచ్ వైరల్!
- 'అమరన్ ' ఇన్ ది సిటీ-చాప్టర్ 1' ప్రారంభం
గ్లామర్ పాత్రకు సిద్ధమనేలా శివాత్మిక
డాక్టర్ జీవితా, రాజశేఖర్ దంపతుల రెండో కుమార్తె శివాత్మిక. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో `దొరసాని` చిత్రం ద్వారా నాయికగా పరిచయమైంది. అంతకుముందు తన తండ్రి చేసిన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమారంగాన్ని ఒంట పట్టించుకున్నారు. తాజాగా ఆమె 'పంచతంత్రం' అనే మూవీలో లేఖ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నిన్న శివాత్మిక పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. ఎల్లో శారీ ధరించి, పక్కింటి అమ్మాయిని తలపించేలా అందులో శివాత్మిక ఉంది.
కాగా, మరుసటి రోజు తన వస్త్రధారణను మార్చేసింది. ఆధునిక భావాలూ తనలో దాగి వున్నాయని ఈ స్టిల్‌ను పోస్ట్ చేసింది. ప్రపంచ సినిమాను పరిశీలిస్తున్న శివాత్మిక నటిగా అమ్మ అంత పేరు తెచ్చుకోవాలని వుందంటూ తరచూ అంటుండేది. అందుకే ఇప్పటి తరానికి తగిన పాత్రలు వేయాలని ముందుకు వచ్చినట్లు ఈ నూతన స్టిల్‌ను విడుదల చేసింది. కథరీత్యా గ్లామర్ పాత్రలకు సిద్ధమే అంటున్న శివాత్మిక కోరిక నెరవేరుతుందోమే చూడాలి.
