సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (20:52 IST)

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి మృతి.. కారణం?

Senthil Kumar
Senthil Kumar
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి గురువారం మధ్యాహ్నం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు.
 
రూహి 2003 నుండి సెలబ్రిటీ యోగా శిక్షకురీలిగా ఉన్నారు. భారత్ ఠాకూర్ ఈమె శిక్ష్యుడు. ప్రభాస్, తమన్నా, ఇలియానా వంటి ఇతర తారలకు రూహి యోగా ట్రైనర్.
 
రుహీనాజ్ అకా రూహి మరణం ఫిల్మ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అదే కారణంతో సెంథిల్ కుమార్ తన పనులన్నింటికీ విరామం తీసుకున్నాడు. సెంథిల్ - రూహి జూన్ 2009లో వివాహం చేసుకున్నారు.
 
జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.