సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 మే 2024 (18:26 IST)

పుష్ప 2 లో సెకండ్ సింగిల్ ను 6 భాషల్లో పాడిన మెలోడీ క్వీన్ శ్రేయఘోషల్

shreya ghoshal
shreya ghoshal
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటిస్తున్న పుష్ప 2 చిత్రం అప్ డేట్ ఏదో  ఒకటి చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా సెకండ్ సింగిల్ ను మెలోడీ క్వీన్'  శ్రేయఘోషల్ జంట పాటతో అలరించనున్నదని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. మెలోడీ క్వీన్' @శ్రేయఘోషల్ జంట పాటతో 6 భాషల్లో సంగీత ప్రియులను అలరిస్తుంది  
 
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్ప 2 సెకండ్ సింగిల్ - #సూసేకి (తెలుగు), #అంగారోన్ (హిందీ), #సూదన (తమిళం), #నోడొక (కన్నడ), #కందాలో (మలయాళం), #ఆగునేర్ (బెంగాలీ)లో మే 29 ఉదయం 11.07 గంటలకు పూర్తి పాట విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
 
ఒక రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ కానున్నదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను  15 AUG 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.