గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (11:07 IST)

పుష్ప: ది రైజ్ కోసం డబ్బింగ్ చెప్పేటప్పుడు.. ఏమో అనుకున్నా... చివరికి?

Pushpa
మరాఠీ- హిందీ చిత్ర పరిశ్రమలో పనిచేసినందుకు పేరుగాంచిన శ్రేయాస్ తల్పాడే, తెలుగు బ్లాక్‌బస్టర్ 'పుష్ప: ది రైజ్' దాని సీక్వెల్ 'పుష్ప: ది రైజ్' కోసం హిందీలో డైలాగ్‌లను డబ్ చేయడంలో ఉన్న సవాళ్ల గురించి నోరు విప్పారు. 
 
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ రచన, దర్శకత్వం వహించిన 'పుష్ప: ది రైజ్'. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అనే కూలీకి సంబంధించిన కథగా తెరకెక్కింది. 'పుష్ప: ది రైజ్' బృందంతో కలిసి పనిచేసిన విషయాన్ని శ్రేయాస్ గుర్తుచేసుకున్నాడు.
 
ఇంకా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "నేను మొదటి భాగానికి డబ్బింగ్ చెప్పినప్పుడు, ఈ చిత్రం ఇంత హిట్ అవుతుందని ఊహించలేదు. 'పుష్ప' అద్భుతం." కొనియాడాడు.