ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (16:48 IST)

రాఖీ, తాళి గురించి క్లారిటీ ఇచ్చిన శ్రీవిష్ణు

Shri Vishnu
Shri Vishnu
లేటెస్ట్‌గా హీరో శ్రీవిష్ణు సామజవరగమన సినిమా చేశాడు. రెబ్బ హీరోయిన్‌. ఈ చిత్ర టీజర్‌ ఈరోజే విడుదలైంది. దాని ప్రకారం హీరో కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె ఆ తర్వాత రాఖీ కడుతుంది. దాంతో షాక్‌ అవుతాడు. అలా ఎంతో మందిని ప్రేమించి పెండ్లి చేసుకోవాలనుకున్నా వారంతా రాఖీ కట్టేస్తారు. దాంతో విసుగెత్తి మీకిచ్చిన డబ్బులకు జి.ఎస్‌.టి. లెక్కేస్తే నేనే నెంబర్‌1 అయ్యేవాడిని అంటూ డైలాగ్స్‌ వుంటాయి.
 
ఈ రాఖీ కాన్సెప్ట్‌ మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? అని అడిగితే, నాకు బయట అమ్మాయిలు ఎవరూ రాఖీ కట్టలేదు. నేను ప్రేమించింది ఒకే అమ్మాయిని. ఆమెకు తాళి కట్టానని క్లారిటీ ఇచ్చాడు. ఈ రాఖీ కాన్సెప్ట్‌ దర్శకుడు సాయికి జరిగిన అనుభవంలోని తీసుకున్నాడని వివరించారు. మరి దర్శకుడుని అడిగితే, నా ఫ్రెండ్‌కు జరిగిన ఓ సన్నివేశాన్ని కథగా రాసుకున్నానని అన్నారు. సో. యూత్‌కు ఫన్‌గా వుండేలా వున్న ఈ చిత్రం మే18న విడుదల కాబోతుంది.