ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (08:29 IST)

హద్దులు దాటుతున్న శృతిహాసన్... అది ప్రత్యేకమై నవ్వు అంటూ...

టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ తన ప్రియుడి శాంతను హజారికాతో బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సమయమంలో ఆమె హద్దులు దాటుతున్నట్టు ఆమె విడుదల చేస్తున్న ఫోటోలు తేటతెల్లం చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా ఆమె తన ప్రియుడితో ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. తాను చాలా లక్కీ గర్ల్‌గా అభివర్ణించింది. తన ప్రియుడి హజారికాతో ఉన్న ఒక రొమాంటిక్ పిక్చర్‌ను రిలీజ్ చేసింది. ఈ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. "అతను నవ్విస్తాడు... అది ప్రత్యేకమైన నవ్వు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 
 
అంతేకాకుండా, శాంతను రూపొందించిన తన కోత్ థీమ్ కేక్ చిత్రాన్ని షేర్ చేస్తూ తనను తాను లక్కీ గర్ల్ అని పిలుచుకుంది. కాగా, ఆరంభంలో శాంతనుతో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు రాగా వాటిని శృతిహాసన్ కొట్టిపారేశారు. ఆ తర్వాత తమ రిలేషన్‌ను ఆమె స్వయంగా అంగీరించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకరినొకరు తెలుసుకోవడానికి తగినంత సమయాన్ని వెచ్చించడంతో వారి బంధం మరింతగా బలపడుతుంది.