బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జులై 2022 (16:43 IST)

ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన గబ్బర్ సింగ్ భామ.. ఆహారం పెట్టే ఆ లక్షణం?

Salar-Prabhas
బాహుబలి స్టార్ ప్రభాస్‌తో గబ్బర్ సింగ్ భామ శ్రుతిహాసన్ సలార్ కోసం కలిసి నటిస్తోంది. ఈ మేరకు ప్రభాస్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా వుందని శ్రుతిహాసన్ తెలిపింది. ఇంకా "అతను చాలా సౌకర్యవంతంగా ఉండే వ్యక్తి" అని శ్రుతి హాసన్ తన 'సలార్' కోస్టార్ ప్రభాస్ గురించి ప్రశంసల వర్షం కురిపించింది. 
 
ప్రభాస్ తన చుట్టూ వున్న వారితో సహజంగా వుంటాడని.. వారి పట్ల ప్రేమగా వుంటాడని.. అతని ఇంటి భోజనం మరిచిపోలేమని శ్రుతిహాసన్ తెలిపింది.  కాగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షూటింగులతో బిజీగా ఉన్నాడు.
 
తాజాగా తన అద్భుతమైన లైనప్‌తో తిరిగి యాక్షన్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఇటీవల ఓం రౌత్ ఇంట్లో కనిపించాడు. అక్కడ అతను తన నలుపు దుస్తుల్లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. 4 పాన్ ఇండియా చిత్రాలతో  ఒకేసారి సూపర్ స్టార్ అయిన ఈ నటుడు.. దయగల స్వభావానికి మారుపేరని ఇప్పటికే పలుసార్లు నిరూపించుకున్నాడు. 
 
ఇక తాజాగా సలార్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతిహాసన్ రెబల్ స్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ చిత్రం షూటింగ్ సెట్స్ లో ప్రభాస్ నటుడి దయగల స్వభావం, అతని ఆతిథ్యంతో చాలా గౌరవం వున్న వ్యక్తిగా అనిపించింది.
 
ప్రభాస్ కలిసి మొదటిసారి కలిసి పనిచేస్తున్నప్పుడు, "ఇది హలో/హాయ్ లాంటిది అనుకున్నాను. కానీ ఈ సినిమా మేకింగ్ సమయంలో నేను ఖచ్చితంగా మొత్తం టీమ్ గురించి మరింత తెలుసుకున్నాను. అతను చుట్టూ ఉండటానికి చాలా సౌకర్యవంతంగా ఉండే వ్యక్తి. అతను సూపర్ చిల్డ్ అవుట్, సూపర్ ఫ్రెండ్లీ, అతనితో కలిసి పనిచేయడం చాలా బాగుంది" అని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది.
 
"ఇది అలాంటి ఆశీర్వాదం. ఈ లోక౦లో ప్రజలకు ఆహార౦ ఇచ్చేవారికి ప్రత్యేక స్థాన౦ ఉ౦ది, ఆయన నిజ౦గా ప్రజలకు ఎ౦తో ప్రేమతో ఆహారాన్ని అందిస్తాడు. ఇది అతని ఉత్తమ లక్షణాలలో ఒకటి" అని శ్రుతి కితాబిచ్చింది. 
Shruti Haasan
shruti haasan
 
శ్రుతిహాసన్ మాత్రమే కాకుండా.. ఇంతకు ముందు, దీపికా, దిశా కూడా ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి రుచికరమైన ఇంటి భోజనం, పూర్తి హైదరాబాదీ థాలీతో పాన్ ఇండియా స్టార్ నుండి ఆత్మీయ స్వాగతం అందుకున్నారు.
 
ఇకపోతే.. ప్రభాస్ పసందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనేతో 'ప్రాజెక్ట్ కె', మరియు కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ , సన్నీ సింగ్ లతో 'ఆదిపురుష్' ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'సలార్'తో పూర్తి యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.