శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (18:48 IST)

సిజు విల్సన్, కాయాదు లోహర్ నటించిన పీరియడ్ డ్రామా పులి రాబోతుంది

puli- Kayadu Lohar
puli- Kayadu Lohar
సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్  కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా 'పాథోన్‌పథం నూట్టండు'. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఈ చిత్రాన్ని 'పులి' – The 19th Century అనే  టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు.
 
ఇప్పటికే విడుదల చేసిన తెలుగు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా  గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఎస్.కె రామచంద్రనాయక్ సహా నిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అనూప్ మీనన్, పూనమ్ బజ్వా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం. జయచంద్రన్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం సమకూర్చారు. వివేక్ హర్షన్ ఎడిటర్ గా, అజయ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా, మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు.
 
తారాగణం: సిజు విల్సన్, కాయాదు లోహర్, అనూప్ మీనన్, పూనమ్ బజ్వా తదితరులు