శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (20:00 IST)

‘‘పుష్పక విమానం’’ నుండి ‘‘సిలకా’’ పాట‌

Pushpaka Vimanam still
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మూడో సినిమా "పుష్పక విమానం" రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ నుండి మొదటి సాంగ్ ను ఈ నెల 15న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ మధ్య బాగా పాపులర్ అయిన రామ్ మిరియాల ఈ సినిమాకు ఓ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ‘‘సిలకా’’ అనే సాంగ్ ను ఆయనే కంపోజ్ చేశాడు. పాట కూడా ఆయనే పాడాడు.అంతే కాదు.ఈ సాంగ్ లో కూడా డాన్స్ మాస్టర్ రఘు తో కలిసి చిందేయబోతున్నాడు. ఆ సాంగ్ ను సోమవారం రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో జరిగింది. ఈ పోస్టర్ లో హీరో ఆనంద్ దేవరకొండ హీరోయిన్ గీత్ సాయిని పెళ్లి దుస్తుల్లో ఉండగా రామ్ మిరియాల,రఘు మాస్టర్ బ్యాండ్ వేళం వాయిస్తూ కనిపిస్తున్నారు. వీళిద్దరూ చమన్ బ్రదర్స్ గా ఈ సాంగ్ లో కనిపిస్తారు.
 
దామోదర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.