గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 10 నవంబరు 2017 (20:14 IST)

ఆ మాటలు విని ఏడ్చేశా... సింగర్ సునీత

గాయని సునీతి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నది తెలిసిన విషయమే. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆమె ఐ డ్రీమ్స్‌తో పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరయినా మిస్ బిహేవ్ చేశారా అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... అలాంటివారు ప్రతిచోటా వుంటారనీ, ఐత

గాయని సునీతి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నది తెలిసిన విషయమే. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆమె ఐ డ్రీమ్స్‌తో పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరయినా మిస్ బిహేవ్ చేశారా అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... అలాంటివారు ప్రతిచోటా వుంటారనీ, ఐతే ఇండస్ట్రీలో తనకు తారసపడినప్పుడు వారికి ఎస్ అనో నో అనో చెప్పకుండా ఎవాయిడ్ చేసేదాన్నననీ, దానితో వారి ఇగో దెబ్బతినేదని వెల్లడించారు. ఐతే ఆ తర్వాత వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు.
 
సినీ ఇండస్ట్రీలో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ, తన శ్రేయోభిలాషులు, అభిమానుల వల్ల నేడు ఇక్కడ వుండగలిగినట్లు చెప్పారు. ఆమె ఇలా... అలా అని కొందరు మాట్లాడుతుంటే చాలా బాధ పడేదాన్నననీ, ఒక దశలో సినీ ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోదామని కూడా అనుకున్నట్లు వెల్లడించారు. ఒకవేళ అలా వెళ్లిపోతే తన పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకుని నిలదొక్కుకున్నట్లు చెప్పుకొచ్చారు.