శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (22:13 IST)

తెలుగు భాషా ప్రాచుర్యానికి సిరివెన్నెల ఎంతో కృషిచేశారు - న‌రేంద్ర‌మోడి

Sastry with Rastrapati
సీతారామశాస్త్రి గారి మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంతాపం తెలియ‌జేస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ప‌ద్మ అవార్డు అందుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్ల‌లో..అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి.

ఇంకా సీతారామశాస్త్రి గారి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా సంతాపం తెలియ‌జేశారు. రెండు తెలుగు ముఖ్య‌మంత్రులు కూడా త‌మ ప్ర‌గాఢ‌సానుభూతిని వారి కుటుంబానికి తెలియ‌జేశారు.ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ, తెలుగు భాష‌కు కృషిచేసిన మాన్యుడిగా పేర్కొన్నారు.