సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 31 మార్చి 2019 (15:48 IST)

నువ్వు మ‌ట్టికొట్టుకు పోతావే.. నువ్వు సీత‌వి కాదే.. శుర్ప‌ణ‌క‌వి : 'సీత' టీజర్

రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి ' ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టిన తేజ ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో 'సీత' అనే చిత్రం చేస్తోంది. ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్ను ఆదివారం విడుదల చేశారు.
 
"నువ్వు మ‌ట్టికొట్టుకు పోతావే.. నువ్వు సీత‌వి కాదే.. శుర్ప‌ణ‌క‌వి" అనే డైలాగ్‌తో ఈ చిత్రం టీజర్ ప్రారంభమవుతుంది. "ఇంత కంత్రి పిల్లకి ఆ పేరు పెట్టారేమిటా అనుకున్నా.. ప‌క్క‌న శ్రీరాముడున్న సంగ‌తి అర్ధం కాలేదు" వంటి సంభాష‌ణ‌లు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. సినిమా మొత్తం కాజ‌ల్ చుట్టూనే తిరగ‌నున్న‌ట్టుగా ఈ టీజర్‌ను బట్టి చూస్తే తెలుస్తోంది.
 
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. శిర్షా రే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. 'ల‌క్ష్మీ క‌ళ్యాణం' సినిమాలో కాజ‌ల్‌ని ల‌క్ష్మీగా ప‌రిచ‌యం చేసిన తేజ తాజా చిత్రంలో సీత‌గా చూపించ‌నున్నాడ‌ట‌. 
 
ఈ సినిమా కాజ‌ల్ కెరియ‌ర్‌లో మ‌రో మంచి హిట్ అవుతుందని యూనిట్ భావిస్తుంది. బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంట‌గా వ‌చ్చిన‌ "కవచం" బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌గా రెండో సారి వీరిద్ధ‌రు క‌లిసి న‌టిస్తున్నారు. ఈ మూవీ మంచి హిట్ కొట్టాల‌ని వారి అభిమానులు కోరుకుంటున్నారు.