గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జులై 2023 (16:27 IST)

పేద స్కూల్ స్టూడెంట్స్ కు సైకిల్స్ పంపిణి చేసిన సితార ఘట్టమనేని

Sitara 11th birthaday
Sitara 11th birthaday
నేడు మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని 11వ జన్మదినోత్సవం సంధర్బంగా పాఠశాలకు వెళ్లే పేద బాలికలకు సైకిళ్లను బహుమతిగా పంపిణి చేసింది. గురువారం జూబ్లీ హిల్స్ లోని మహేష్ బాబు ఇంటిలో ఈ కార్యక్రమం జరిగింది. సితార పిలుపు మేరకు 50మంది మహిళా స్టూడెంట్స్ తమ టీచర్ లతో హాజరయ్యారు. సితార ఇంటిలోంచి రావడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. అనంతరం కేక్ సితార కట్ చేసింది. సితారకు స్టూడెంట్స్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. 
 
Sitara cycles disribute
Sitara cycles disribute
తమకు సైకిల్స్ ఇవ్వడం పట్ల వారు ఆనందం వ్యక్ష్యం చేశారు. సితార చక్కగా పలుకరిస్తూ తమతో ఓ ఫ్రెండ్ లా ఉందని పిల్లలు అన్నారు. ఈ టైములో ఏమిచేస్తున్నారు అని స్టూడెంట్స్ అడిగితే, ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నానని సితార అన్నారు. తనకు ఫాదర్, మదర్ ఇద్దరూ అంటే ఇష్టమని ఓ ప్రశ్నకు సితార బదులిచ్చారు. పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరికి సితార పెట్టడం విశేషం.