బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (23:13 IST)

ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ తొలి పోస్ట్.. అందమైన క్షణాలు.. వీడియో వైరల్

Pawan Kalyan, Sai Dharam Te
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మొదటి పోస్ట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. తాజా పోస్ట్‌లో తన సినీ ప్రయాణం గురించి పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు. 
 
చిత్ర పరిశ్రమలో భాగమై ఎందరో ప్రతిభావంతులు, వినయపూర్వక వ్యక్తులతో కలిసి పని చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాజా పోస్టులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, కోలీవుడ్ నటుడు విజయ్, కార్తీ, విక్రమ్‌లతో పవన్ గడిపిన అందమైన క్షణాలను ఈ పోస్ట్‌లో పొందుపరిచారు. 
 
పవన్ కళ్యాణ్ ఈ పోస్ట్‌కి ఎప్పటికీ ఆదరించాల్సిన క్షణాలు అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.