బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (23:00 IST)

దళిత స్నేహితుడిపై నీచ ప్రవర్తన.. చెవిలో మూత్ర విసర్జన

crime scene
దళితులపై నీచంగా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో దళితుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా దళితుడి చెవిలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఉత్తర్​ ప్రదేశ్​ సోన్​భాద్ర జిల్లాలోని జుగైల్​ ప్రాంతంలో ఈ నెల 11న జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బాధితుడు, నిందితుడు స్నేహితులని తెలుస్తోంది.
 
జవహర్​ పటేల్​ అనే వ్యక్తి, గులాబ్​ కోల్​ అనే దళితుడిపై దాడి చేశాడు. చివరికి, కిందపడేసి, అతని చెవిలో మూత్ర విసర్జన చేశాడు. మద్యం మత్తులో నిందితుడు ఈ అమానవీయ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.