ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (17:51 IST)

ఒక అబ్బాయితో ఐదేళ్లపాటు రిలేషన్‌లో ఉన్నాను : సోనాక్షి సిన్హా

హిందీ చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఒకరు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 
 
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ ఎవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో శత్రుఘ్న సిన్హా ముద్దుల కుమార్తె. 'దబాంగ్' సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. 
 
వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తుంది. సోనాక్షి సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ అమ్మడు తాజాగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక అబ్బాయితో తాను దాదాపు ఐదేళ్లు రిలేషన్ షిప్‌లో ఉన్నానని చెప్పుకొచ్చింది. 21-22 వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్ షిప్‌ను కొనసాగించానని వివరించింది.