గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (20:39 IST)

వైద్యురాలి ప్రాణం తీసిని కారు సీటు బెల్ట్

కారు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ఓ వైద్యురాలు సీటు బెల్టు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఆమె సీటు బెల్ట్ లాక్ కావడంతో ప్రాణాలు విడిచారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తమిళనాడులోని పుదుక్కోట జిల్లా తురైయూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల సత్య కృష్ణగిరి హోసూరిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.
 
కాగా శుక్రవారం నాడు ఆమె తన అత్తయ్యగారితో కలిసి కారులో బయలుదేరారు. ఆమె తురైయూర్ సమీపానికి రాగానే భారీ వర్షం కురవడం మొదలైంది. ఆ వర్షంలోనే వెళ్తున్న సత్య కారు రైల్వే అండర్ బ్రిడ్జి కింద వాన నీటిలో చిక్కుకుపోయింది. ఎంతకీ కదల్లేదు. వెంటనే కారు నుంచి సత్య అత్తయ్య కిందకు దిగి బయటకు వచ్చారు. కానీ సత్య బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె సీటుకి పెట్టుకున్న బెల్ట్ రాలేదు. అది పూర్తిగా లాక్ అయిపోయింది. దీనితో ఆమెను వాన నీరు ముంచేసింది. ఊపిరాడక సత్య అక్కడే ప్రాణాలు విడిచారు.