గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 18 సెప్టెంబరు 2021 (17:42 IST)

పాన్‌-ఆధార్‌ అనుసంధాన గడువు మరో 6 నెల‌లు పొడిగింపు

బ్యాంక్ ఖాతాల నిర్వ‌హ‌ణ‌కు పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయాల్సిందేన‌ని ప‌లు చోట్ల ప‌ట్టుప‌డుతున్న త‌రుణంలో వినియోగ‌దారుల‌కు కొంత రిలీఫ్ దొరికింది. పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసే గ‌డువును కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి పొడిగించింది. 
 
ఆధార్‌తో పాన్‌ అనుసంధాన గడువును ఆరు నెలల పాటు అంటే, 2022 మార్చి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఆధార్‌ సంఖ్యను శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)తో అనుసంధానం చేయడానికి గడువును సెప్టెంబరు 30, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది.
 
అదే సమయంలో.. ప్రొహిబిషన్‌ ఆఫ్‌ బినామీ ప్రోపర్టీ ట్రాన్సాక్షన్స్‌ యాక్ట్‌-1988 కింద నోటీసులు, ఆదేశాల జారీకి గడువును సైతం మార్చి 2022 వరకు పెంచారు.