మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:47 IST)

ఆ పని చేయకుంటే బ్యాంకు ఖాతాను క్లోజ్ చేయనున్న ఎస్బీఐ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌గా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు ఓ హెచ్చరిక చేసింది. తమ బ్యాంకులో ఖాతాలు కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్‌ చేసుకోవాలని సూచించింది. 
 
బ్యాంకు పనులను సజావుగా జరగాలంటే ఆధార్‌, పాన్‌ కార్డులను అనుసంధానం చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.
 
కాగా, పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయడానికి గడువు సెప్టెంబర్‌ 30వ తేదీ. మీరు పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయకపోతే మీ పాన్‌కార్డు డియాక్టివేట్‌ అవుతుంది. పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడం అనేది ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది. 
 
ఈ ఆధార్‌ లింక్‌ను జూన్‌ 30వ తేదీ వరకు గడువు ఉండగా, దానిని పొడిగించారు. మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయకపోతే సెక్షన్‌ 234 హెచ్‌ కింద వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
 
అందువల్ల అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయాలని సూచిస్తున్నాయి. ఈ రెండింటిని అనుసంధానం చేయడం వల్ల బ్యాంకు లావాదేవీలు సజావుగా జరుపుకోవచ్చని ఎస్‌బీఐ సూచించింది.న్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడం ఎలా..?