మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:36 IST)

దేశంలో మరో రోజు తగ్గిన డీజిల్ ధర

దేశంలో మరోమారు డీజిల్ ధరలు తగ్గాయి. తాజాగా రాయితీతో ఇచ్చే సబ్సీడీ గ్యాస్ బండపై రూ.25 పెంచిన చమురు కంపెనీలు డీజిల్‌ రేటును మరోసారి తగ్గించాయి. వరుసగా మూడో రోజు లీటర్‌ డీజిల్‌పై 25 పైసల మేర కోత విధించాయి. అయితే పెట్రోల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. 
 
దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర 20 పైసలు తగ్గి.. రూ.89.27గా ఉండగా, పెట్రోల్‌ ధర రూ.101.84గా ఉంది. అదేవిధంగా ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.83, డీజిల్‌ రూ.96.84కు చేరింది. 
 
ఇక చెన్నైలో పెట్రోల్‌ రూ.99.47, డీజిల్‌ 93.84, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.08, డీజిల్‌ రూ.92.52గా ఉన్నది. హైదరాబాద్‌లో కూడా లీటర్‌ డీటిల్‌పై 20 పైసలు తగ్గింది. దీంతో డీజిల్‌ ధర రూ.97.33గా ఉండగా, పెట్రోల్‌ 105.83గా ఉన్నది.