గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (15:04 IST)

తల్లి కాబోతున్న సోనమ్ కపూర్.. హాట్ డ్రెస్.. భర్త ఒడిలో పడుకుని..?

sonam kapoor
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తల్లి కాబోతోంది. ఫ్యాషన్‌కి ఈమె మారు పేరు. తాజాగా ఆమె సోమవారం ఇన్‌స్టా ద్వారా తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కన్ఫామ్ చేసింది. సూపర్ కొటేట్స్‌తో తన ప్రెగ్నన్సీ ఫోటోలను షేర్ చేసింది సోనమ్ కపూర్. మాతృత్వపు మధురిమని చూడబోతున్నట్లు ప్రకటించింది.
 
కొంత కాలంగా సోనమ్ కపూర్ వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ స్టార్ డాటర్ సోషల్ మీడియా వేదికగా తన ప్రెగ్నెన్సీని కన్ఫార్మ్ చేసింది. ఇందుకోసం హాట్ డ్రెస్ ధరించి.. తన భర్త ఒడిలో పడుకున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
 
గర్భంతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన సోనమ్ కపూర్.. తన బేబీ కోసం ‘నాలుగు చేతులు.. నిన్ను ఉత్తమంగా పెంచడానికి మేం చేయగలిగిందంతా చేస్తాం. రెండు హృదయాలు. నీ గుండె చప్పుడుతో అడుగడుగునా కలిసే ఉంటుంది. ఒక కుటుంబంగా నీకు ఎల్లప్పుడూ మా ప్రేమ, మద్దతు అందిస్తాం. నీకు వెల్‌కం చెప్పేందుకు ఇంక వేచి చూడలేం' అంటూ రాసుకొచ్చింది. 
 
ఇకపోతే అనిల్ కపూర్ కుమార్తెగా సోనమ్ కపూర్ 2007లోనే ‘సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది.