కేటీఆర్‌ను కలిసిన సోనూసూద్
సినీ నటుడు సోనూసూద్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ చేస్తున్న సేవలకి గాను కేటీఆర్ అభినందించి సత్కరించారు.
తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సోనూసూద్ కేటీఆర్ కి వెల్లడించారు. ఇలాగే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ మరింత ముందుకు వెళ్ళాలని కేటీఆర్ అభినందించారు.
ఇక అటు ఓ రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, కష్ట సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ అన్నారు. మంత్రి కేటిఆర్‌తో పాటు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఐటి సెక్రటరీ జయెష్ రంజన్‌లు ఉన్నారు.