మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:53 IST)

అమ్మా... మిమ్మలను బూతు మాటలతో తిడితేగానీ వారికి అర్థం కాలేదు.. చెప్పుతో కొట్టండి : శ్రీరెడ్డి వినతి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లికి నటి శ్రీరెడ్డి ఓ విజ్ఞప్తి చేశారు. పవన్ తల్లిపై అసభ్య పదజాలంతో మాట్లాడిన అంశంపై శ్రీరెడ్డి శనివారం స్పందించారు. అమ్మా... మీ చెప్పుతో కొట్టండి అంటూ ట్వీట్ చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లికి నటి శ్రీరెడ్డి ఓ విజ్ఞప్తి చేశారు. పవన్ తల్లిపై అసభ్య పదజాలంతో మాట్లాడిన అంశంపై శ్రీరెడ్డి శనివారం స్పందించారు. అమ్మా... మీ చెప్పుతో కొట్టండి అంటూ ట్వీట్ చేసింది.
 
'పవన్ కల్యాణ్ అమ్మగారికి నా శిరస్సు వంచి పది లక్షల సాష్టాంగ నమస్కారాలు. నన్ను క్షమించండి అమ్మ, మీ చెప్పుతో కొట్టండి. కానీ సినీ పెద్దలకు మిమ్మల్ని అంటే కానీ అర్థం కాలేదమ్మా ఈ ఒంటరి ఆడపిల్ల బాధ. మీ ఫోటో చూసి 10 లక్షల సార్లు క్షమించమని వేడుకున్నా అమ్మ' అంటూ ట్వీట్ చేసింది.
 
అంతకుముందు ఒక ట్వీట్‌లో 'ఫ్యాన్స్ అంటే జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి, ప్రజల సమస్యల కోసం పోరాడుతూ.. నలుగురికి మార్గదర్శకం అవ్వాలి అంతేకానీ సహనం లేకుండా కార్‌లు పగలగొట్టడం కాదు. ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ గారికి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు' అని తెలిపింది. 
 
శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్‌కు అల్లు అర్జున్, రామ్ చరణ్ రాకపై స్పందిస్తూ మెగా ఫ్యామిలీ ఇలా ఎప్పుడో స్పందించి ఉంటే చాలా హూందాగా ఉండేదని, ఏది ఏమైనా రామ్ చరణ్, అల్లు అర్జున్‌కి తాను వీరాభిమాని అంటూ తన ట్వీట్‌లో పేర్కొంది.