శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 జులై 2018 (10:01 IST)

టాలీవుడ్‌లోకి జూనియర్ శ్రీదేవి.. స్టార్ హీరోకు జోడీగా...

వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే "ధడక్" చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈమె... టాలీవుడ్‌లో కూడా నటించనుంది.

వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే "ధడక్" చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈమె... టాలీవుడ్‌లో కూడా నటించనుంది.
 
'ధడక్' చిత్రంలో జాన్వీ నటకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే, ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో శ్రీదేవికి టాలీవుడ్‌లో చాలా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కువ సినిమాలు టాలీవుడ్‌లోనే చేశారు. దీంతో జాన్వితో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పించాలని బోనీకపూర్ భావిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే జాన్వీని తెలుగులో ఓ స్టార్ హీరో ప‌క్కన హీరోయిన్‌గా తీసుకోవాల‌ని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశ‌గా దిల్ రాజు ప్రయ‌త్నాలు మొదలు పెట్టారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.